తాడూర్ మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డా.రాజేష్ రెడ్డి సమీక్ష
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరాలి - అధికారులకు దిశానిర్దేశం
నాగర్ కర్నూల్ , మండలం తాడూర్: తాడూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, పెండింగ్‌లో ఉన్న పనులపై అధికారులతో ఎమ్మెల్యే వివరంగా సమీక్షించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై రాములు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


