ఆర్మూర్ కు చేరుకున్న భారత మహా విశ్వకర్మ ఏక్తాయాత్ర.
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) విజన్ ఆంధ్ర సెప్టెంబర్ 25:- భారతదేశ చరిత్రలో ఒక విశ్వకర్మ ఆర్గనైజేషన్ నుంచి మొట్టమొదటిసారి చేస్తున్న 1700 కిలోమీటర్ల మహాపాదయాత్ర విశ్వకర్మ ఏక్తాయాత్ర గురువారం రోజున ఆర్మూర్ కు చేరుకుంది. ఏక్తా యాత్ర కు ఆర్మూర్ లో విశ్వనాధుల పుష్పగిరి ని కలిసి సంఘీభావం ప్రకటించిన విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ.విశ్వనాధుల పుష్పగిరి సుదీర్ఘ పాదయాత్ర విశ్వకర్మల కోసం చేయడం విశ్వకర్మ సమస్యలపై గళం ఎత్తడం అభినందనీయమని చెప్పడం జరిగింది విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో దేశవ్యాప్త విశ్వకర్మల ఐక్యత, సాంస్కృతిక పూర్వ వైభవం, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, రాజకీయ పునరేకికరణే లక్ష్యంగా హైదరాబాదు నుండి ఢిల్లీ వరకు ఏడు రాష్ట్రాల గుండా 74 రోజులు సాగే 1700 కిలోమీటర్ల మహాపాదయాత్ర .. గల్లి నుంచి ఢిల్లీ వరకు విశ్వకర్మల పాదయాత్ర వలన ఢిల్లీలో రాజకీయ నాయకులకు చలనం వచ్చి విశ్వకర్మ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసేలా యాత్ర కొనసాగుతుందని విశ్వనాధుల పుష్పగిరి స్పష్టం చేయడం జరిగింది ఇందులో పాదయాత్ర చేస్తున్న విశ్వనాధుల పుష్పగిరి గారికి సంఘం సభ్యులు నాయకులు విశ్వకర్మలు అభినందనలు తెలియజేయడం జరిగింది. అనంతరం మహిపాల్ చారి గారిని విశ్వనాధుల పుష్పగిరి ఘనంగా సన్మానించడం జరిగింది కార్యక్రంలో అంబిడి హన్మండ్లు.. సుంకం శివకు మార్.నూనె సుదర్శన్. నర్సింలు.లింగం సుద్దాల శీను మరియు విశ్వకర్మ సంఘాల నాయకులు విశ్వకర్మ ప్రతినిధులు ఆర్మూర్ విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నరు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


