ఆదిలాబాద్ పట్టణం లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం.

ఆదిలాబాద్ పట్టణం లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం.

  • ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి
  • ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపు*

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ పట్టణంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి, ఎదులాపురం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జన సార్వజనిక శోభాయాత్ర శుక్రవారం శ్రీ సరస్వతి శిశు మందిర్, వినాయక్ చౌక్ నుంచి భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, శాసనసభ్యులు పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, వార్డు కౌన్సిలర్ ఆకుల రేవతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా సమాజంలో ఐక్యత, భక్తిభావం, సోదరభావాన్ని పెంపొందించే గొప్ప సాంస్కృతిక సంప్రదాయమన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణేష్ ఉత్సవాలను నిమజ్జన కార్యక్రమంతో అదే భక్తిభావంతో పూర్తి చేసుకోవాలని కోరారు. శోభాయాత్రలో సంప్రదాయ వాయిద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు జిల్లా యంత్రాంగం, పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించిన రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మున్సిపాలిటీ ద్వారా గత ఏడాది కంటే అధికంగా రూ.37 లక్షలు, సీసీ కెమెరాల నిర్వహణకు రూ.25 లక్షలు, రోడ్డు మరమ్మతులకు రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను డీజేలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్, ఇందూర్ విభాగ్ సహ విభాగ్ ప్రచారక్ మీసరి ప్రకాష్ ప్రధాన వక్తగా హాజరై దిశానిర్దేశం చేశారు. అనంతరం శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో ప్రతిష్ఠించిన గణనాథునికి ముఖ్య అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు లచ్చన్న, ప్రవీణ్, పట్టణ ప్రముఖులు, భక్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-25 at 3.35.08 PM (1)

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని