పాఠ్య ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు
కామారెడ్డి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కామారెడ్డి 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ప్రైమరి స్కూల్ లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూజ్ అందించారు. విద్యార్థుల సంక్షేమమే రేవంత్ సర్కార్ ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎన్జీవోస్ కాలనీ ప్రైమరి స్కూల్ లో 140మంది విద్యార్థులకు దుస్తువులు, షూజ్ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్, రజిత, శైలజ, గీత, నీరజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


