బాల్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని నర్మల అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం షెడ్యూల్ లో భాగంగా శుక్రవారం బాల్య సంరక్షణ పై అవగాహన , సంప్రదాయ శిశు సంరక్షణ పద్ధతులను ప్రారంభ బాల్య సంరక్షణ దశ ,నవజాత శిశు సంరక్షణ,తల్లిపాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ,శిశువులకు,తల్లితండ్రులు పరస్పర సంబంధాలపై అవగాహన కల్పించడం జరిగింది.మరియు 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్చన ఆంజనేయులు, ఎంపిడిఓ రాజేందర్, సిడిపిఓ సబితా , ఏసీ డిపిఓ ఉమారాణి , ఉపసర్పంచ్ గొర్రె సుదర్శన్,ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప, వనిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రూత్ , అంగన్వాడీ టీచర్స్,అంజలీదేవి, పద్మ, ఆశాలు, గర్భవతులు, బాలింతలు, కిషోరబాలికలు,పిల్లలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


