గిద్ద చెరువులో స్వచ్ఛత కార్యక్రమం

గిద్ద చెరువులో స్వచ్ఛత కార్యక్రమం

నిమజ్జనం అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు

రాజన్న సిరిసిల్ల' ఎల్లారెడ్డిపేట: స్వచ్ఛత హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వినాయక నిమజ్జన స్థలమైన గిద్ద చెరువులో గురువారం శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నిమజ్జనం అనంతరం చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ పూలు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామపంచాయతీ సిబ్బంది వేర్వేరుగా సేకరించి, కంపోస్టింగ్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నరసింహులు, ఉప సర్పంచ్ బంధారపు బాల్ రెడ్డి, ఈఓ కృష్ణ, వార్డు సభ్యులు అంగూరి ప్రవీణ్ కుమార్, అంతర్పుల గోపాల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి, సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని