రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
మల్లంపల్లి, : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని జెడీ మల్లంపల్లి టౌన్ అధ్యక్షులు చిదర సంతోష్ విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయానికి భరోసా కల్పించారని, ప్రస్తుతం రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతుభరోసా నిధులు ఆలస్యం కావడం, పంట నష్టపరిహారం అందకపోవడం, రుణమాఫీపై అయోమయం, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. పంటలు కాపాడుకునేందుకు కరెంట్ కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, గతంలో 24 గంటల విద్యుత్ అందించగా ప్రస్తుతం కేవలం 6 గంటల కరెంట్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పించాలని, నిరంతర విద్యుత్ అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తూ వారి హక్కుల కోసం పోరాడుతామని చిదర సంతోష్ స్పష్టం
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


