బోయిన్పల్లిలో జనరల్ హెల్త్ క్యాంపు

బోయిన్పల్లిలో జనరల్ హెల్త్ క్యాంపు

90 మందికి వైద్య పరీక్షలు.. 27 మంది క్షయ అనుమానితుల నుంచి స్ఫుటం నమూనాల సేకరణ

మిడ్జిల్, మిడ్జిల్ మండల పరిధి బోయిన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మీర్జా ఆధ్వర్యంలో గురువారం బోయిన్పల్లి గ్రామంలో జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, కాళ్ల నొప్పులు, ఒళ్లునొప్పులు తదితర వివిధ ఆరోగ్య సమస్యలతో క్యాంపునకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 90 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, షుగర్, బీపీ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు మందులు అందజేశారు. క్యాంపులో 27 మంది క్షయ అనుమానితులను గుర్తించి స్ఫుటం (కఫం) నమూనాలను సేకరించారు. పరీక్షల్లో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందించడంతో పాటు, పోషకాహారం కోసం నెలకు రూ.1,000 చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ అనూష, హెల్త్ అసిస్టెంట్ దేవయ్య, ఏఎన్‌ఎంలు చంద్రకళ, తిరుపతమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ మోహన్ రాజ్, ఆశా కార్యకర్తలు నాగమణి, రాజేశ్వరి, తిరుపతమ్మ, యాదమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 72

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News