బూత్ స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

బూత్ స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

దౌల్తాబాద్,సిద్దిపేట: మండల పరిధిలోని సూరంపల్లి, దొమ్మాట, ముబారస్పూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉండేలా పనిచేయాలని నాయకులు సూచించారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్హులైన వారికి వాటి ప్రయోజనాలు అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గ్రామ కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్‌ను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి, మండల ఉపాధ్యక్షుడు డాకోల్ల ఆంజనేయులు గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొర్రోళ్ల స్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడాల మల్లేశం, కాశీం, నాయకులు తలారి యేసు,ఇమ్రాన్,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 118

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని