పేదల ఆరోగ్యప్రదాయని "సీఎం సహాయనిధి"
అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్
రంగారెడ్డి/అబ్దుల్లాపూర్:పేదల ఆరోగ్య సంరక్షణలో సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని, ఇబ్రహీం పట్నం శాసనసభ సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక చొరవతో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని 11మంది లబ్ధిదారులకు ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు కావడం జరిగిందని అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆదేశాను సారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో చిన్న రావిరాల గ్రామ సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్, బాటసింగారం మాజీ ఎంపీటీసీ కేశెట్టి వెంకటేష్, సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్, చిన్నరవిరాల గ్రామశాఖ అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


