ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.

ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.

ప్రభుత్వ విద్యకు నగదు ప్రోత్సాహం

సంగారెడ్డి డెస్క్,: పేదరికాన్ని జయించి విద్యలో ప్రతిభ కనబరిచిన జిల్లా  పరిషత్తు హై స్కూల్ మల్కాపూర్,కొండాపూర్  మండలంకు చెందిన విద్యార్థిని ఎ.వర్షిత కి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి 10 వ తరగతి పరీక్షలో 594 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.  ఆమెతో పాటు మరో విద్యార్థిని కె. మౌనిక కూడా 592 మార్కులు సాధించగా రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని  శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది.హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున ఈ నగదు ప్రోత్సాహకాలను గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల  అందజేశారు.  ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కష్టపడి చదివి విజయం సాధించిన విద్యార్థులను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో మరింత కృషి చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాషి,శ్రీరామ్ ఫైనాన్స్ ఎండి  ప్రవీణ్ ,శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్  వరుణ్ కిషోర్,శ్రీరామ్ లైఫ్ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  శ్రీనివాస రెడ్డి,హైదరాబాద్ జోనల్ మేనేజర్ నరేందర్, సంగారెడ్డి డివిజన్ ఏజీఎం విజయ్,బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్,స్థానిక మల్కాపూర్ పాఠశాల హెడ్మాస్టర్  యాదగిరి,ఉపసర్పంచ్  ప్రవీణ్ పాల్గొన్నారు.

Views: 126

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని