పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుడు కంసాని రాజిరెడ్డి

అక్కన్నపేట,  : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌’ డిజిటల్ విధానం ద్వారా ఎరువుల విక్రయాలు చేపట్టడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుడు కంసాని రాజిరెడ్డి ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువుల విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డిజిటల్ విధానం కార్పొరేట్ వ్యవసాయదారులకు అనుకూలంగా ఉందని, చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఆయన అన్నారు. ఎరువులు కొనుగోలు చేసేందుకు రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆన్‌లైన్ సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతిలో విక్రయాలు కొనసాగించాలని కోరారు.రైతులకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను సడలించి, సాగు సమయంలో అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు బుర్ర రవి, లింగాల పరశురాములు, చింతల పరశురాం రెడ్డి, తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ