రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని

కుల్కచర్ల, వికారాబాద్ :  రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అంకిత ఎంపికైనట్లు కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబా, పీఈటీ క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పరిగి పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని అంకిత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ రోజు నుంచి 7వ తేది వరకు గోదావరిఖనిలోని పెద్దపల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అంకితను అభినందించారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News