కోయిలకొండ మండలంలో సంచలనం సృష్టించిన సునీత హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.. జైలుకు తరలింపు
కోయిలకొండ, : కోయిలకొండ మండలంలోని చింతలతాండ గ్రామంలో గత నవంబర్ 2న మధ్యాహ్నం చోటుచేసుకున్న కాట్రావత్ సునీత (26, భర్త: బాలరామ్, కులం: ఎస్టీ-లంబాడా) హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాన్య నాయక్ (తండ్రి: మాణిక్య నాయక్), ఆయన మరుదలైన కాట్రావత్ పార్వతి (భర్త: పాండు నాయక్) ఇద్దరిని నేడు (మంగళవారం) మధ్యాహ్నం చింతలతాండ బస్ స్టాప్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించగా వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మహబూబ్‌నగర్ గౌరవ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్ & ప్రొబేషన్) జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుని అరెస్ట్ చేస్తామని మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ వెల్లడించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Nov 2026 16:55:06
నాగర్ కర్నూల్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి ఆర్ జి టి ఏ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని 24...
