పెద్దమల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్

పెద్దమల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్

భిక్కనూర్ :  భిక్కనూర్ మండలం  పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియను రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టి నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరమే గోదాములకు తరలించాలని సిబ్బందికి సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి నర్సింలు, సొసైటీ చైర్మన్  బాలగౌని రాజాగౌడ్,  సీఈఓ,మోహన్ గౌడ్, డైరెక్టర్లు సూరం కిష్టయ్య, చల్మెడ బాబు, రైతులు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 63

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News