రేషన్ కార్డుదారులకు ఆరు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి: ఎంసీపీఐయు నాయకులు
బెల్లంపల్లి, (మంచిర్యాల జిల్లా) : రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఆరు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల భారాన్ని తగ్గించేందుకు కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి, పసుపు వంటి ఆరు సరుకులను రేషన్ ద్వారా అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినప్పటికీ, ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

