పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శివానంద స్వామి
- కోయిలకొండ మండలంలోని అభంగపట్నంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహణ
కోయిలకొండ : కోయిలకొండ మండలంలో నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శివానంద స్వామి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని అభంగపట్నం గ్రామంలో గల పశు ఆరోగ్య ఉపకేంద్రంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సిర్ర వంశీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శివానంద స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కరువును అధిగమించి పాడి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందన్నారు. మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం వ్యవసాయ భూములలోనే పశుగ్రాసాన్ని పెంచేందుకు ఉచితంగా విత్తనాలను సరఫరా చేస్తోందని, రైతులు ఈ సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఉచిత వైద్య సేవలు.అనంతరం పశు వైద్యాధికారులు పశువులకు ఉచితంగా గర్భకోశ వ్యాధుల చికిత్సలు అందించారు. చిన్న దూడలకు నట్టల నివారణ మందులను తాపించారు. పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. అలాగే, పశువుల ఆరోగ్యం పట్ల శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గండీడ్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ నరేందర్, అభంగపట్నం వీఎల్వో చందర్, పశు వైద్య సిబ్బంది హర్షవర్ధన్, జి. సురేందర్, సతీష్, శిక్షణ వైద్యాధికారులు, గోపాల మిత్రులు బి. వెంకటనారాయణ, రామకృష్ణ, రాములు, తదితరులతో పాటు భారీ సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


