ఈ-హెచ్ఆర్ఎంఎస్, ఈ-శాంక్షన్స్, వామిస్‌పై అధికారులకు శిక్షణ

ఈ-హెచ్ఆర్ఎంఎస్, ఈ-శాంక్షన్స్, వామిస్‌పై అధికారులకు శిక్షణ


నిజామాబాద్, : నిజామాబాద్ జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఈ-హెచ్ఆర్ఎంఎస్ (e-HRMS), ఈ-శాంక్షన్స్ (e-Sanctions), వామిస్ (WAMIS – వర్క్స్ అకౌంట్స్) అంశాలపై జిల్లా స్థాయి అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జిల్లా ట్రెజరీ అధికారి కే.దశరథ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగగా, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ-హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఉద్యోగుల మానవ వనరుల నిర్వహణ, ఈ-శాంక్షన్స్ ద్వారా ప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ, వామిస్ ద్వారా పనులకు సంబంధించిన ఆర్థిక, అకౌంట్స్ నిర్వహణ విధానాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. ఆయా ఆన్‌లైన్ వ్యవస్థల వినియోగం, వాటి ద్వారా చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై వివరించారు.
జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు (హెచ్‌ఓడీలు), డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీఓలు) ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధిత ఆన్‌లైన్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగిస్తూ, విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఏ.ఓ దేవీసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News