వెల్దండ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మృతి - అశ్రు నివాళి.

వెల్దండ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మృతి - అశ్రు నివాళి.


🔹గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్. 

వెల్దండ

వెల్దండ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తుక్కుగూడ దగ్గర మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ భూపతి దాస్ చిత్ర పటానికి పూలమాల వేసి  బుధవారం  నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ …విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన మంచి ఉపాధ్యాయుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 
విద్యార్థుల పట్ల చూపిన ప్రేమ, క్రమశిక్షణ ఎన్నటికీ మరువలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. రామ్ రెడ్డి,ఉప సర్పంచ్ బి. శ్రీను, జీపీఎచ్ఎస్ హెడ్ మాస్టర్ రవీందర్ నాయక్,
 సునీత, వార్డు సభ్యులు మసిగుండ్ల వెంకటేష్, మారేపల్లి మంజుల శ్రీను,కొయ్యల పుల్లయ్య, మట్ట విష్ణు, ఉపాధ్యాయ బృందం 
పావని, శ్రీ లక్ష్మి, సంతోషి రాణి, 
సుగుణ, తిరుపతి, చంద్రశేఖర్, అంజియా నాయక్, మరియు పాఠశాల విద్యార్థుని విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News