ప్రజాసేవలో ముందుంటున్న ఉప్పల వెంకటేష్
ఎల్లికట్టలో మూడు దేవాలయాల పునర్నిర్మాణానికి సొంత నిధులతో సహకారం ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు శేఖర్ కుటుంబానికి భరోసా పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రం పరిశీలన
కల్వకుర్తి(నాగర్ కర్నూల్) : ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి మండలంతో పాటు పట్టణంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో హనుమాన్, శివాలయం, చెన్నకేశవ స్వామి దేవాలయాల పునర్నిర్మాణంలో భాగంగా పైకప్పు నిర్మాణానికి తన సొంత నిధులతో సహకరిస్తూ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు శేఖర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఆయన ఇద్దరు పిల్లల పాఠశాల ఫీజులను తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


