ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలు పెంచాలి....

ఉపాధ్యాయుల శ్రమ దోపిడీని అరికట్టాలి......హైకోర్టు న్యాయవాది,టిఆర్జిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దీరావత్ రవి డిమాండ్...

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలు పెంచాలి....

 నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రతినిధి : 
ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,బోధనేతర సిబ్బందికి ప్రస్తుత ధరలకు అనుగుణంగా గౌరవప్రదమైన వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం (TRGS) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,హైకోర్టు న్యాయవాది దీరావత్ రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.బుధవారం హాలియా పట్టణంలోని వివిధ ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,సిబ్బందిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఉపాధ్యాయుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా దీరావత్ రవి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులే ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో తీవ్ర ఆర్థిక,మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హతలు,అనుభవం ఉన్నప్పటికీ చాలామంది ఉపాధ్యాయులకు కనీస స్థాయిలో కూడా వేతనాలు చెల్లించడం లేదని,పని గంటలు ఎక్కువగా ఉన్నప్పటికీ తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను కేవలం లాభాల సాధనకు ఉపయోగించుకునే సాధనాలుగా చూడకుండా,విద్యా వ్యవస్థలో కీలక భాగస్వాములుగా గుర్తించాలని అన్నారు.ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనాలు,ఉద్యోగ భద్రత,సెలవులు,ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం టిఆర్జిఎస్ (TRGS) ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని,ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు,సిబ్బంది తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో టిఆర్జిఎస్(TRGS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్,సహాయ కార్యదర్శి రామావత్ నరేష్ నాయక్,మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు సరిత,నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సభావత్ శివానాయక్ నియోజకవర్గ కోశాధికారి సభవత్ ప్రదీప్ నాయక్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 52

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News