కూనిపూర్ గ్రామం లో భూముల సర్వే ప్రారంభించిన సర్పంచ్.

కూనిపూర్ గ్రామం లో భూముల సర్వే ప్రారంభించిన సర్పంచ్.

బాన్సువాడ  :  బాన్సువాడ నియోజకవర్గం లోని వర్ని మండలం కూనీపూర్ గ్రామం లో బుధవారం భూ భారతి భూముల సర్వే ప్రారంభించిన సర్పంచ్. చాలా కాలంగా గ్రామంలో భూముల తగాదాలు జరగడం తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో వచ్చిన తర్వాత ప్రతి ష్టాత్మకం గా నిర్వహిస్తున్న భూ భారతి సర్వే పనుల ను గ్రామం లో ప్రారంభించడం తో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూనీపూర్ గ్రామంలో భూ భారతి సర్వే ద్వారా భూముల శాశ్విత పరిష్కారం లభించి గ్రామం లోని రైతులు సజావు గా తమ పంటలు పండించుకు నే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి తో లబ్ధి చేకూరాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్, సర్వేర్ డి చంద్రయ్య ఆర్. ఐ భీమేష్, మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, కాంతారావు, రెడ్డి వినోద్, శివకుమార్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News