వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
బిజినపల్లి(నాగర్ కర్నూల్) : బిజినపల్లి మండలం లూర్ధునగర్‌లోని ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక బుధవారం సందర్శించారు. వృద్ధులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. వృద్ధులతో పాటలు పాడించి వారిలో ఉత్సాహం నింపారు. వృద్ధాప్య దశలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆహ్లాదకరంగా జీవించాలని సూచించారు. వృద్ధులకు ఏవైనా సమస్యలు, అవసరాలు ఉంటే తమ సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గవర్నమెంట్ లాయర్ శ్రీరామ్ ఆర్య, ఆశ్రమ నిర్వాహకురాలు సిస్టర్ రవికుమారి, వృద్ధులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సందర్శన కార్యక్రమం నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


