తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..

తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదే..

నిజామాబాద్ :  తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత యువతదేనని నగర మేయర్​ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని న్యూ అంబేద్కర్​ భవన్​లో జిల్లా యువజన, క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు 2026-27లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, తెలంగాణ కళా వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సంస్కృతీ సంప్రదాయాలే సమాజానికి మూలస్తంభాలని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్న యువతీయువకుల సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చక్కటి వేదికగా ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని చాటిచెప్పాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుమారి కౌలుత్ ఆర్తీ చౌహాన్ నృత్య ప్రదర్శనలో అద్భుతంగా నృత్యాన్ని ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఆమె ప్రతిభకు మెచ్చిన ప్రముఖులు ఆర్తీ చౌహాన్ ను ఘనంగా సత్కరించి మెమెంటో ప్రధానం చేశారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News