మహాదేవపూర్ లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం
అచ్చంపేట ( నాగర్ కర్నూల్ జిల్లా) : అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో మహాదేవపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత పశు గర్భకోశ చికిత్స పశువైద్య శిబిరం విజయవంతంగా జరిగింది పశుగణభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ డి అనిల్ ఆధ్వర్యంలో శిబిరానికి పెద్ద సంఖ్యలో పశువులు రైతులు తీసుకురావడం జరిగింది 23 పశువులకు గర్భకోశ సంబంధిత చికిత్సలు 72 దూడలకు నటల నివారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది మందులు పంపిణీ చేశారు ఈ శిబిరం ద్వారా పశువుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాడి రైతులకు ఉచిత పశువైద్య సేవలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఇమ్మడి సైదులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాంప్రసాద్ గౌడ్ మాజీ ఎంపిటిసి ఆంజనేయులు డాక్టర్ మహేశ్వరి పి నాగేష్ కిషోర్ జీవీకే గోపాలమిత్ర సూపర్వైజర్ గోపాల్ గోపాల మిత్రులు ఎల్లగౌడ్ గంధం పర్వతాలు కరీం తిరుపతయ్య పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

