ఈరోజు IDOC టీఎన్జీవో కార్యాలయం నందు,
నిజామాబాద్ : ఈరోజు IDOC టీఎన్జీవో కార్యాలయం నందు, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ గారి అధ్యక్షతన.... ఏర్పాటుచేసిన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎజెండా అంశాలపై చర్చించిన అనంతరం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నిలిచిన TGEJAC సంఘం,2 పెండింగ్ DA ను సాధించుకోవడంలో సఫలీకృతం అయిందని, ఇదే వరవడితో ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు
దీనికి గాను టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
PRC కమిషన్ నుండి త్వరితగతిన నివేదికలు తెప్పించుకొని, 51% ఫిట్మెంట్ తో కూడిన PRC ని వెంటనే అమలు చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను పటిష్టంగా అమలు చేయాలని,
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా టీఎన్జీవో మెంబర్షిప్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్టుగా తెలియజేస్తూ...ప్రతీ ఉద్యోగి విధిగా టిఎన్జీవో సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు
అనంతరం వివిధ శాఖల జిల్లా ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు
ఇట్టి జిల్లా కార్యవర్గ సమావేశానికి టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి నిరంజన్ గౌడ్ మరియు శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని ఎజెండా అంశాలపై చర్చించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


