40 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభించిన పోచారం.

10 లక్షల తో నూతనం గా నిర్మించిన మహిళా శాఖ స్వయం సహాయక సంఘ భవనం.... 30 లక్షల తో నిర్మించిన ఆహార ధాన్యాలు భవనాన్ని ప్రారంభించిన పోచారం...

40 లక్షల  అభివృద్ధి పనులు ప్రారంభించిన పోచారం.

 బాన్సువాడ :  40 లక్షల అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించిన పోచారం. రైతునగర్, బీర్కూర్ మండలం బాన్సువాడ నియోజకవర్గం రైతునగర్ గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ భవనం, ఆహార ధాన్యాల నిల్వ భవనాలను ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ నియోజకవర్గం, బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామం లో  విబి - జి రాంజీ  నిధులు రూ.10 లక్షల తో నూతనంగా నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని, రూ.30 లక్షలతో నిర్మించిన ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించారు. పాల్గొన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో  రవీందర్ రెడ్డి.ఈ సందర్భం గా పోచారం మాట్లాడుతూ. నూతనంగా నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘ భవనాన్ని మహిళలు, ఆహార ధాన్యాల నిల్వ భవనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ భవనాలు మహిళా సంఘాల కార్య కలాపాలకు, రైతులకు ధాన్యాల నిల్వ సౌకర్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలను దృష్టి లో ఉంచుకొని రైతులు, గ్రామాల ప్రజలు తాగునీరు, సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించు కోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి  సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసమే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నిజాంసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తామని, సాగునీటి కోసం నీటిని విడుదల చేయకూడదని ప్రభుత్వం ఆదేశించిన విషయాన్ని రైతులకు వివరించారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని తమ బోర్లలో నీటి లభ్యతను పరిశీలించు కోవాలని, విద్యుత్ కోతలు, సాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ముఖ్యం గా వరి పంటకు అధిక మొత్తం లో నీరు అవసరమవుతుందని, అందువల్ల నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పోచారం శ్రీనివాసరెడ్డి రైతుల కు విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు, రైతులు నీటిని బాధ్యతా యుతం గా వినియోగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో  బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News