కొమురవెల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎసిపి
కొమురవెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను హుస్నాబాద్ ఏసీపి సదానందం వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ ను తనికి చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం పరిశీలించి, స్టేషన్లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసు ప్రాపర్టీ, స్టేషన్ ఆవరణలో ఉన్న కేసు సంబంధిత వాహనాలను పరిశీలించారు.అదేవిధంగా, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, సీసీటీఎన్ఎస్ (CCTNS) తదితర విభాగాల పనితీరును సమీక్షించి, సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు.అలాగే, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు మరియు ఇతర నేరాల దర్యాప్తు విషయంలో కొమురవెల్లి ఎస్ఐ మహేష్ కు ,పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసి, దర్యాప్తును నిష్పాక్షికంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వార్షిక తనిఖీలో ఏసిపి సదానందం తో పాటు, చేర్యాల సీఐ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


