ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారి లో విద్యార్థుల హాజరు పై ప్రత్యేక దృష్టి......
ఎఫ్ఆర్ఎస్ నమోదు, పరీక్ష ఫీజుల చెల్లింపు, స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేసుకోవాలి ప్రిన్సిపాల్ సూచన.....
బాన్సువాడ : ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారి లో ప్రస్తుత విద్యా సంవత్సరాని కి సంబంధించి మొత్తం 243 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో అడ్మిషన్లు పొందడం సంతోష కరమైన విషయమని కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో సగం మంది మాత్రమే కళాశాల కు క్రమం తప్ప కుండా హాజర వుతున్నారని, మిగతా విద్యార్థులు కూడా ప్రతిరోజూ కళాశాలకు హాజరై విద్యా భ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు. విద్యార్థుల హాజరు ను క్రమ బద్ధీకరించడం తో పాటు, హాజరు శాతాన్ని పర్య వేక్షించేందు కు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాల లో ఇంకా సుమారు 53 మంది విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో తమ ముఖచిత్రాల ను నమోదు చేసుకోవాల్సి ఉందని, ఇప్పటివరకు నమోదు చేసుకోని విద్యార్థులు వెంటనే కళాశాలకు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు ఈ నెల 9వ తేదీ చివరి గడువుగా ఉందని, విద్యార్థు లందరూ గడువు లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఫీజు చెల్లించే సమయం లో ప్రతి విద్యార్థి తప్పని సరిగా పదో తరగతి మార్కుల మెమో జిరాక్స్ ప్రతిని తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్స్, షూస్, సాక్స్, బ్యాగులు, బెల్టులు, ఐడీ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాల ను విద్యార్థు లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి సంవత్సరం విద్యార్థులు తమకు సంబంధించిన విభాగాల ద్వారా కొత్త స్కాలర్షిప్ దరఖాస్తులు సమర్పించాలని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ స్కాలర్షిప్లను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భం గా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని ప్రతి రోజూ కళాశాల కు పంపించాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో, నిరంతర హాజరుతో చదువుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ధన్యవాదాలతో...
మీ గడ్డం గంగారాం,
ప్రిన్సిపాల్
ప్రభుత్వ జూనియర్ కళాశాల గాంధారి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

