హుస్నాబాద్ డిపో నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు
హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకన్న హుస్నాబాద్ విజన్ ఆంధ్ర నవంబర్ 5÷
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ నుండి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు టీజీఆర్టీసీ హుస్నాబాద్ డిపో శుభవార్త చెప్పింది.ఈ సందర్బంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ వెంకన్న తెలిపారు.ప్రతి ఏటా శబరిమలకు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని హుస్నాబాద్ డిపో నుండి సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక సౌకర్యాలు ఇవే..!
ప్రతి బస్సులో ఒక గురుస్వామి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్ సీటు లేకుండా ఉచితంగా వెళ్లవచ్చు.పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ అయ్యప్పస్వాములు సీటు లేకుండా ఉచితంగా వెళ్లవచ్చు. భక్తులకు అనుగుణంగా విశ్రాంతి, భోజనాల కోసం బస్సును ఆపుతారు. భక్తులు కోరుకున్న ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఈ టూర్‌లో చూసే వెసులుబాటు ఉందన్నారు.
ఈ సౌకర్యాన్ని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీని ఎంచుకోవాలని డిపో మేనేజర్ కొరారు .
బుకింగ్ కోసం డిపో మేనేజర్ ఎన్ వెంకన్న 9959225930,
STI– 9704833971,
నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


