తెలంగాణలో మద్యం సునామీ.. 3 రోజుల్లోనే రూ.653 కోట్ల మద్యం ఖాళీ!
అక్టోబర్ 19 నాటికి రూ.2054 కోట్లకు చేరిన అమ్మకాలు.. గతేడాది కంటే రూ.555 కోట్లు అధికం
నాగర్ కర్నూల్: తెలంగాణలో దసరా పండుగ వేళ మద్యం ఏరులై పారింది. మందుబాబులు ఫుల్ జోష్ లో ఉండటంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.652.92 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) డిపోల నుండి వైన్ షాపులకు ఈ మేరకు సరుకు తరలిపోయింది.
ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీలోపే రికార్డు స్థాయిలో ఏకంగా రూ.2054.51 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుండి వైన్ షాపుల యజమానులు లిఫ్ట్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి, అంటే అక్టోబర్ 19 వరకు రూ.1499.46 కోట్ల మద్యం మాత్రమే తరలింది. దీంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.555.05 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగినట్లు టీజీబీసీఎల్ లెక్కలు చెబుతున్నాయి. పండుగ డిమాండ్ దృష్ట్యా వైన్ షాపుల యజమానులు ముందుగానే భారీగా స్టాక్ లిఫ్ట్ చేయడంతో ఈ రికార్డు నమోదైందని అధికారులు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


