దీపావళి సందర్భంగా పేకాటపై ప్రత్యేక నిఘా

పేకాట ఆడినా, ఆడించినా కఠిన చర్యలు తప్పవు పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా పేకాట నిర్వహణ, ప్రోత్సాహం, సహకారం అందించిన వారిపై చట్టపరమైన చర్యలు

దీపావళి సందర్భంగా పేకాటపై ప్రత్యేక నిఘా


*సమాచారం అందించండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ బ్యూరో : దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా పేకాట నిర్వహించినా, ఆడినా, ఆడించినా లేదా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి ఇతరులను ప్రోత్సహించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. పేకాట చట్టవిరుద్ధమైన కార్యకలాపమని, పేకాట నిర్వహణకు ఎలాంటి అవకాశం లేకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నా, ఆడిస్తున్నా లేదా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలిసినా వెంటనే జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నంబర్ 8712659973 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలందరూ పోలీసులకు సహకరించి పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ దీపావళి పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని  సూచించారు.
పేకాటకు దూరంగా ఉండండి – పండుగను ప్రశాంతంగా జరుపుకోండి.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News