అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఎర్రన్న బౌతికకాయానికి ఎమ్మెల్యే నివాళి

అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 నిజామాబాద్ :  నిజామాబాద్ రూరల్
మోపాల్ మండల కేంద్రానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గు ఎర్రన్న అకాల మరణం అంత్యంత బాధాకరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే గురువారం వారి నివాసానికి వెళ్లారు . ఈ సందర్భంగా ఆయన బౌతికకాయానికి పూల మాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని.. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ఎర్రన్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిది అన్నారు. కాగా ఆయన మరణాంతరం ఆయన శరీరాన్ని ఆసుపత్రికి వైద్య విద్యార్థులకు పరిశోధన నిమిత్తం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇది ఎంతోమందికి ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు   సాయరెడ్డి, రవి, కమ్యూనిస్టు నాయకులు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News