పెద్దాపూర్ వద్ద వాహనాల తనిఖీలు- హెల్మెట్ లేకుండా వెళ్తే చర్యలు తప్పవు.le
🔸 వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి.
వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి -756 పై వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, కేవలం పోలీసుల కోసం కాకుండా తమ కుటుంబం కోసం హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని, వెంటనే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దండ సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

