ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం--

జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య.

ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం--

నాంపల్లి  :  మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం వల్ల రామదాస్ తండా వంటి మారుమూల తండాలలో ఫ్లోరోసిస్ సమస్య పూర్తిగా తొలగిపోవడం పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్  స్పెషల్ మానిటర్ డాక్టర్ అనీవేష్ భట్టాచార్య సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమమని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.బుధవారం ఆయన నాంపల్లి మండలంలోని రాందాస్ తండా గ్రామాన్ని సందర్శించి, ఇంటింటికీ తిరుగుతూ మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ముందుగా మెగావత్ అంతిరాం ఇంటికి వెళ్లి నల్లా ద్వారా ఎన్ని రోజులకు ఒకసారి నీరు వస్తుందని ? నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని? అడిగి తెలుసుకున్నారు. రోజుకు రెండు సార్లు నీరు సరఫరా అవుతున్నదని, నీటిని నిల్వ చేసుకుని అవసరాలకు వినియోగించుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.నల్లాలకు లీకేజీలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.మిషన్ భగీరథ పథకం రాకముందు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని? ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గతంలో బోరు నీటిపైనే ఆధారపడేవారమని, ఫ్లోరైడ్ నీటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నామని గ్రామస్థులు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్లోరోసిస్ సమస్య తగ్గిపోయిందని గ్రామ సర్పంచ్ మేఘావత్ చిట్టి శ్రీనివాస్ ఎన్ హెచ్ ఆర్ సి స్పెషల్ మానిటర్ కు తెలిపారు.గ్రామంలో మరికొంతమంది ప్రజలతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం తాగునీటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని అడిగారు. ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి నీరు వస్తుందని, అవసరమైన నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసుకుని వినియోగించుకుంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఫ్లోరోసిస్ కేసులు ఏమైనా ఉన్నాయా? అని ఆశా కార్యకర్తను అడగగా, ప్రస్తుతం ఎలాంటి కేసులు లేవని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ కేసులు నమోదు కాలేదని మండల అధికారులు వివరించారు. సాధారణంగా సీజనల్ వ్యాధులు మినహా ఇతర ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు.ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించినట్లు గ్రామ కార్యదర్శి వివరించారు. గ్రామంలో మొత్తం 250 గృహాలు ఉన్నాయని తెలిపారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో వినియోగిస్తున్న తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఫ్లోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చని, మిషన్ భగీరథ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆయన సూచించారు.మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరావు, చండూరు ఆర్డీవో శ్రీదేవి, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ లక్ష్మీనారాయణ, డిఈ అజయ్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రామకృష్ణ శర్మ, సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్,ప్రయోగశాల ఇంచార్జ్ పి. వీరారెడ్డి,  అధికారులు,గ్రామ ప్రజలు ఉన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News