బాలుర జూనియర్ కళాశాలలో బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విద్యార్థులకు బ్యాగులు, యూనిఫామ్స్ అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, వార్డు కౌన్సిలర్ చంద్రకళ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు నిజాం, పడిగే శంకర్, అవంచ మాధవి, రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు హాసన్, ఇసాక్, ఖాదర్, హమీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారూ
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


