ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి,

హరీష్ రావు దృష్టికి సమస్యలు తీసుకెళ్తా.. ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి

ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి,

మెదక్ : ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం 23 రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు 
కంఠారెడ్డి.తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను ఇకనైనా ప్రభుత్వం పట్టించుకొని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను బుధవారం ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కంఠారెడ్డి. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ,వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని, అలాంటి సిబ్బంది తమ హక్కుల కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, జీవో 60, జీవో 1195 ప్రకారం పెంచిన వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు.మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు వైద్య సేవలందించే సిబ్బంది సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్లను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానని కంఠరెడ్డి తిరుపతిరెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 23 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని, ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని ధర్నా విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో టీఎన్జీవో మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి.మాణిక్య రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ బట్టి. ఉదయ్ కుమార్,నాయకులు మాయ.మల్లేశం, ఇందాద్, సాయి,చంద్ర మెహన్ గౌడ్, సతీష్ రావు,శ్రీనివాస్, గంజి. నవీన్,స్వామి నాయక్,
నర్సారెడ్డి,భాను తదితరులు ఉన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News