పి ఆర్ జి టి ఏ నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
నాగర్ కర్నూల్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి ఆర్ జి టి ఏ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నూతన కమిటీని 24 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెరుగుతున్న పని ఒత్తిడి, పరిపాలనా ఇబ్బందులు, హక్కులు, సంక్షేమ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్షులుగా తవిటి రేణుబాబు, గౌరవ అధ్యక్షులుగా జి.ఎస్. రాఘవన్, ప్రధాన కార్యదర్శిగా వలపట్ల అర్జున్, ఉపాధ్యక్షులుగా ఎన్. సాయిబాబు గౌడ్, జె. రాఘవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసోసియేట్ అధ్యక్షులుగా సంపత్ కుమార్, యాదగిరి, అదనపు ప్రధాన కార్యదర్శిగా వలపట్ల శ్రీనివాసులు, కార్యదర్శులుగా బాబయ్య, వెంకటేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి. చెన్నయ్య, చెల్లెపాటి పాండు, ఎన్. భాస్కర్ తదితరులు ఎన్నికయ్యారు.
ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించాలి : రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులపై రోజురోజుకూ పెరుగుతున్న బోధనేతర పనిభారాన్ని తగ్గించి, నాణ్యమైన విద్యాబోధనకు అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, ఆత్మగౌరవం, హక్కులు, సాధికారతకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని యాజమాన్యాల గురుకుల ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు.
పి ఆర్ జి టి ఏ ప్రధాన డిమాండ్లు :
1. అన్ని గురుకుల సొసైటీలకు ఉమ్మడి కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
2. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలి.
3. అన్ని యాజమాన్యాల గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలి.
4. గురుకులాల్లో కేర్టేకర్లను నియమించి ఉపాధ్యాయులపై అదనపు పనిభారాన్ని తగ్గించాలి.
5. ఉపాధ్యాయులకు మెరుగైన పని వాతావరణం కల్పించి, బోధనేతర పనిభారాన్ని తగ్గించాలి.
6. ఉపాధ్యాయుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం, సాధికారతను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలి.ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల సొసైటీల ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ, సమస్యల పరిష్కారం జరిగే వరకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ జి టి ఏ రాష్ట్ర నాయకులు గుర్రం రమేష్ గౌడ్, డా. నిర్మలానందం, ఉప్పు అశోక్, రామకృష్ణారెడ్డి, ఇడికోజు శ్రీనివాస చారి, నాగేశ్వరరావు, పానుగంటి విజయ్, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, పగుడాల నరసింహ, యాదవచారి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


