శబరిమల అయ్యప్ప స్వాముల పాదయాత్ర ప్రారంభించిన పోచారం.
బాన్సువాడ : శబరిమల అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను గురువారం ప్రారంభించిన పోచారం. బాన్సువాడ నుండి శబరి మలకు “సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర” ప్రారంభం. బాన్సువాడ పట్టణ కేంద్రం లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం లో స్వామి వారి ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహా దారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతరం బాన్సువాడ నుండి పవిత్ర శబరిమల క్షేత్రం వరకు పాదయాత్ర గా బయలు దేరుతున్న “సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర” కు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఘనం గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భం గా బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, అయ్యప్ప గురు స్వాములు, స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల తో విజయవంతం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


