సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం –  మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు లాల్ సింగ్

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సుజాతనగర్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామ పరిధిలోని మంజీత్ కాటన్ మిల్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు లాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పత్తి రైతులకు మద్దతు ధర అందించడంతో పాటు, రైతులు పండించిన పత్తిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పత్తి విక్రయించే రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, అవసరమైన పత్రాలతో కొనుగోలు కేంద్రానికి రావాలని ఈ సందర్భంగా సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, పీఏసీఎస్ కొత్తగూడెం చైర్మన్ మండే వీర హనుమాన్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, సీసీఐ బయ్యర్ సింహాద్రి నాయుడు, సీపీఐ మండల కార్యదర్శి భూక్య బద్రు , వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అజ్మీర్ ఆమ్రు, మాలోత్ అశోక్ బాబు, సపావత్ రవి, వాడే లక్ష్మీ, జోగా రామయ్య, తేజావత్ రవికుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎం.డి. హిమాయత్ హుస్సేన్, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభంతో పరిసర ప్రాంతాల రైతులకు పత్తి విక్రయాల్లో మరింత సౌలభ్యం కలగనుంది. రైతులు ప్రభుత్వ కొనుగోలు విధానాలను సద్వినియోగం చేసుకొని, తమ పంటకు గిట్టుబాటు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!