కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

శుద్ధి చేసిన నీటి నాణ్యత, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

హైదరాబాద్: కోకాపేటలోని గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిల్లింగ్ స్టేషన్‌లో శుద్ధి చేసిన నీటి నాణ్యత ప్రమాణాలు, నిర్వహిస్తున్న పరీక్షలు, వాటి ఫలితాలను ఆయన సమీక్షించారు. నీటి నాణ్యతకు సంబంధించిన పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఫిల్లింగ్ మార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ట్యాంకర్‌లో నింపిన నీటి పరిమాణం, ఫిల్లింగ్‌కు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. శుద్ధి చేసిన నీటి నాణ్యతతో పాటు సరఫరా చేస్తున్న పరిమాణంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.

నిర్మాణ రంగంలో, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, ఉద్యానవనాల నిర్వహణ వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించడాన్ని ప్రోత్సహించాలని ఎండీ పేర్కొన్నారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని పెంచడం ద్వారా తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించవచ్చని తెలిపారు. నీటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా వివరాల్లో పారదర్శకత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కె. అశోక్ రెడ్డి ఆదేశించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News