అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య
మహబూబ్‌నగర్ : గండీడు మండల పరిధిలోని వెన్న చెడు గ్రామానికి సంబంధించిన దొబ్బలి మల్లేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ వెన్నచేడ్ గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య మానవత్వాన్ని చాటుకున్నారు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్స్ తగ్గడంతో చికిత్స పొందుతున్న దొబ్బలి మల్లీశ్వరి గారిని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధితురాలికి మనోధైర్యాన్ని అందించారు. అలాగే వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, కష్టకాలంలో బాధితులకు ధైర్యాన్ని అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ప్రజాసేవే లక్ష్యం… ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


