ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి లతోకలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .
నిజామాబాద్ : ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల 11 నెలలు అవుతుంది అని, ఒకపక్క బిఆర్ఎస్ బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశమై అందులో జిల్లా కాంగ్రెస్ నాయకుల అందరము పాల్గొని జిల్లాలోని ఆర్ఓబి గురించి మరియు వివిధ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడడం జరిగిందని, మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి 2021లో 93 కోట్ల 12 లక్షలతో చేపట్టడం జరిగిందని,అప్పుడు జీఎస్టీ 12% ఉండేదని దానిని 18% పెరిగిందని దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టు నిధులు 8.68 కోట్లు పెంచి 101.80 కోట్లకు పెంచి జీవో ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా ముఖ్య నాయకులను 24వ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆర్ఓబి పై చర్చించి జీవో విడుదల చేయిస్తున్నామని గ్రహించిన అరవింద్ అకస్మాత్తుగా ధర్నా చేయడం జరిగిందని, ఆ ధర్నాలో ప్రజలు ఎవరు కూడా రాలేదని కేవలం అరవింద్ ఉనికి కోసమే ధర్నా చేశారని, స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థులను తీసుకువచ్చి ధర్నాలు చేశావని, నువ్వు ఎంపీగా 8 సంవత్సరాలలో జిల్లాకు ఏం అభివృద్ధి చేశావని,. బండి సంజయ్ కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చాడని నువ్వు ఎందుకు నిజాంబాద్ సిటీ తీసుకురాలేదని ప్రశ్నించారు జిల్లాకు పసుపు బోర్డు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న అరవింద్ దానివల్ల రైతులకు జరిగిన లాభమేమి లేదని తెలిపారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారి పట్టుదలతో జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలో మూడు కళాశాలలు మంజూరు అయితే అందులో ఒకటి నిజాంబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించడం జరిగిందని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను తీసుకురావడం జరిగిందని ,నిజామాబాద్ అర్బన్ లో డివిజన్‌కు కోటి రూపాయల చొప్పున 60 కోట్ల అభివృద్ధి కొరకు తీసుకురావడం జరిగిందని, జిల్లాలో సుమారు 400 కోట్లు అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగిందని, భీంగల్ నుండి బాసర వరకు హైవే తీసుకురావడం జరిగిందని ,భీమ్‌గల్ లింబాద్రి గుట్ట అభివృద్ధి కొరకు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. మాధవ్ నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పనులు నతనడకన నడుస్తున్నాయని రైల్వే డిపార్ట్మెంట్ గతంలో బ్రిడ్జి ఎత్తు 5.6 ఇచ్చారని ఇప్పుడు దానిని 6.25 కి తీసుకురావడం ద్వారా ఇంజనీర్లు రీ డిజైన్ చేయడం ద్వారా నిర్మనా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని,కేంద్ర ప్రభుత్వ తప్పులు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పును నెట్టడం సరైనది కాదు అని అన్నారు. అదేవిధంగా brs నాయకులు నీళ్లు వదిలాలని కాలేశ్వరం వెళ్లడం జరిగిందని 10 సంవత్సరాల పాలనలో లక్షల కోట్ల అప్పు చేశారని ప్రశాంత్ రెడ్డి జిల్లాకు తీసుకువచ్చింది ఏమీ లేదు అని సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా గుత్ప అల్లి సాగర్ ఎత్తు పెంచి నిజాంబాద్ పట్టణానికి తాగునీరు అందించడం జరిగిందని, వ్యవసాయానికి నీళ్లు అందిస్తున్నామని, మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది ,షబ్బీర్ అలీ గారు డిచ్‌పల్లిలో 400 కె.వి సబ్‌స్టేషన్ తీసుకురావడం జరిగిందని, సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్యాకేజ్ 20 21 800 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, దానికి మీరు 300 కోట్లు ఖర్చు పెడితే జిల్లాలో సుమారు 85 ఎకరాలకు సాగుకు నీరు అందే, దానిని మీరు నిర్వీర్యం చేశారని కాలేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 36 కోట్లకి డిజైన్ తీసుకువస్తే దానికి 5000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6000 కోట్లు ఖర్చు చేశారని 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఎందుకు దాని దాని డిజైన్ మార్చి లక్ష పదివేల కోట్లకు తీసుకుపోవడం జరిగిందని కేవలం మీ కమిషన్ల కోసమే డిజైన్ మార్చి అవినీతి చేశారని రైతులకు ఎక్కడ కూడా మీరు అందించిన పాపాన మీరు పోలేదని, మీ స్వార్థాలను కప్పిపుచ్చుకోవడానికి తునికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి గారు ఒకపక్క అభివృద్ధిని మరొక సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందిస్తున్నామని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని అమలు చేస్తున్నామని రైతులకు దాదాపు 22 వేల కోట్లతో రుణమాఫీ చేయడం జరిగిందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని, రైతులకు సన్నబడ్లకు బోనస్ సంధిస్తున్నామని, గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క నూతన రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందని, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చేస్తున్న కూడా కేవలం తమ స్వార్థాల కొరకు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని అరవింద్ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని 8 సంవత్సరాలలో జిల్లాకు నువ్వు చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాల 11 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి కోశాధికారి భక్తవస్తలం, ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్,మహిళ నగర అధ్యక్షురాలు రేవతి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బెన్సన్ రాజు,సీనియర్ నాయకులు మీసాల సుధాకర్,డిసిసి ప్రధాన కార్యదర్శి రవి, కార్పొరేటర్ మనోహర్ కార్పొరేటర్ పంచారెడ్డి చరణ్,డిసిసి కార్యదర్శులు సుభాష్,మూల్గురి గణేష్,కౌడపు రఘు,నయీం షార్హన్,నరేందర్, పోలా శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


