దేశంలో చొరబాటు దారులు చొరబడుతుంటే బిజెపి ప్రభుత్వం ఏమి చేస్తుంది ?
పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి
హుస్నాబాద్ : సర్ ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయంల వల్ల 13 కోట్ల 50 లక్షల కోట్ల ఓట్లు అన్యాయంగా పోతున్నాయని,వెంటనే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయన్నారు.వాస్తవానికి ఫామ్ 6,విషయంలో 2002 సంవత్సరంలో గతంలో మీ తల్లిదండ్రులు ఎక్కడ ఓటు వేశారు చెప్పాలని, ధ్రువీకరించుకోవాలన్నారు.అదేవిధంగా ఫామ్ 6, నింపి ఇచ్చిన తర్వాత చిన్న పొరపాట్లకు కూడా ఓటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫామ్ 7, ఏమైనా అభ్యంతరాలు తెలుపటానికి, ఫామ్ 8, చిరునామా మారితే నింపి ఇవ్వటానికి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని,ఫామ్ సిక్స్ నిబంధనలు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. కానీ పార్లమెంటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోక ముందే సీఈఓ జ్ఞానేష్ కుమార్ 25 సంవత్సరాల నుండి ఓటు ఎక్కడ వేశారు వారి తల్లితండ్రులు ఎక్కడ ఓటు వేశారు వివరాలు అడగటం గందరగోళానికి దారి తీసిందన్నారు.ఇట్టి విషయంలో తనతో పాటు పనిచేస్తున్న ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ల అభ్యంతరాలను పట్టించుకోకుండా బిజెపి ప్రభుత్వం చెప్పిన విధంగా ఒంటెద్దు పోకడ పోవడం ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు దీక్షలు చేయడం జరుగుతుందన్నారు.నిన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి పొరపాటు దారులకు ఓటు హక్కు కల్పించమని వారిని ఈ దేశం నుండి తరలి కొడతామని చెప్పడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మూడు కోట్ల మంది ఈ దేశంలో చోర పడుతుంటే రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది అని , ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని బిఎస్పి పార్టీ పక్షాన ప్రశ్నించారు.అయోధ్య గుడిలో 500 కోట్లు కాజేసిన విషయం గురించి మాట్లాడరని,నిత్యవసర వస్తువుల ధరలు ఎంత పెరిగిన మాట్లాడరని,నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించరన్నారు.
పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని ఈ సమస్యలపై ప్రధానమంత్రి మోడీ మాట్లాడరన్నారు.బిజెపి పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అయోధ్యకు మహా పాదయాత్ర చేసి చెంపలేసుకుని తప్పులు ఒప్పుకుని వందల కోట్ల దొంగతనానికి పాల్పడిన విషయంలో బాధ్యతగా శ్రీరామచంద్రుని క్షమాపణ అడగాలని, చోరీకి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పి పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


