సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన

సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన

మెదక్ : కృషి విజ్ఞాన కేంద్రం (KVK), తునికి నందు జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) పథకంలో భాగంగా చిన్న చింతకుంట మరియు జక్కపల్లి గ్రామాలకు చెందిన సహజ వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో దాని పాత్ర, సాగు ఖర్చులను తగ్గించుకోవడం, భూసారాన్ని పెంపొందించడం, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై రైతులకు వివరించడం జరిగింది. అలాగే సహజ వ్యవసాయంలో అవలంబించాల్సిన వివిధ పద్ధతులు, జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం తయారీ మరియు వినియోగం, పంటలలో అంతర పంటలు, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను ఆచరణలో అమలు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, నేల ఆరోగ్య పరిరక్షణ మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ఏడీఏ శ్రీమతి సంధ్యారాణి , ఏవో టెక్నికల్ యాదగిరి , చిన్న చింతకుంట మరియు జక్కపల్లి గ్రామాల సహజ వ్యవసాయ రైతులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు తేజస్విని, రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News