ఫ్లోరైడ్ సమస్యపై వాస్తవాలు వెలికితీయాలి
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సామాజిక కార్యకర్త వినోద్ హిందుస్థానీ సూచన
నల్గొండ/మర్రిగూడ : నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందానికి సామాజిక కార్యకర్త, న్యాయవాది వినోద్ హిందుస్థానీ పలు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా పరిష్కారం కాని సమస్యలను వినోద్ హిందుస్థానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిలదీశారు. ముఖ్యంగా ఫ్లోరోసిస్ బారిన పడి దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పాత బాధితులకు తగిన ఆర్థిక సహాయం అందించే విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన ప్రశ్నించారు. అలాగే, వ్యవసాయానికి బోర్ల ద్వారా భూగర్భ జలాలను వాడటం వల్ల వరి తదితర పంటలపై ఫ్లోరైడ్ ప్రభావం పడుతోందన్న ఆందోళనలను ఆయన వివరించారు.దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారి బాధితుల ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే తప్పకుండా పరిశీలిస్తామన్నారు. పంటలు కలుషితం అవుతున్నాయనడానికి ప్రస్తుతం ఆధారాలు లేనప్పటికీ, వ్యవసాయ భూములపై ఫ్లోరైడ్ ప్రభావం గురించి కచ్చితంగా శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అంగీకరించారు. ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని న్యాయవాది వినోద్ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


