బామ్సెఫ్ 13వ జాతీయ మహాసభల కరపత్రాల విడుదల
మల్యాల, : జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్‌లో ఈ ఆదివారం రోజున నిర్వహించనున్న బామ్సెఫ్ 13వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.మల్యాల మండల కేంద్రంలో ముప్పారపు రవీందర్ ఆధ్వర్యంలో ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలను ముఖ్య నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముప్పారపు రవీందర్ మాట్లాడుతూ, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు మేధావులు, ఉద్యోగులు, యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బామ్సెఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రెవెల్లి రవీందర్, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేశం, జగిత్యాల జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు బొల్లి కిషన్, మల్యాల మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీసీ సంఘం నాయకులు, రైతు వికాస వేదిక వ్యవస్థాపకులు జనగం శేఖర్, మండల అంబేద్కర్ సంఘాల సీనియర్ నాయకులు అజయ్, లింగన్న, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


