గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే ఆపరేటర్లకు కౌన్సెలింగ్.
భూపాలపల్లి :పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు భూపాలపల్లి పట్టణ సీఐ చెన్నూరి శ్రీనివాస్ డీజే ఆపరేటర్లతో కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జన ఊరేగింపు సమయంలో అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని, ప్రజలకు, వృద్ధులకు, చిన్నారులకు మరియు ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడవద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు మరియు పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి అధిక శబ్దంతో డీజేలు నిర్వహించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు డీజే ఆపరేటర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని భూపాలపల్లి పట్టణ సీఐ చెన్నూరి శ్రీనివాస్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


