​పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ సహకారం అభినందనీయం

​పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ సహకారం అభినందనీయం

​సారంగాపూర్: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అడెల్లి విద్యార్థుల పట్ల గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్  ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రశంసనీయమైన సేవలు అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల ప్రయోజనార్థం సర్పంచ్ దండు సాయన్న పిల్లలకు సివిల్ యూనిఫామ్‌లను  అందజేశారు. ​గత జూన్ మాసంలోనే పాఠశాలలో బోధన సులువుగా సాగేందుకు గాను సొంత ఖర్చులతో ఒక విద్యా వాలంటీర్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాల రూపురేఖలు మార్చడానికి, విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు సర్పంచ్  అందిస్తున్న ఈ నిరంతర తోడ్పాటుపై పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. ​ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ"పాఠశాల మరియు పిల్లల పట్ల సర్పంచ్  చూపుతున్న ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం మాపై మరింత బాధ్యతను పెంచాయి. వారి ప్రేరణతో పిల్లలకు మరింత నాణ్యమైన చదువును అందిస్తూ, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తాం" అని తెలిపారు. సర్పంచ్  ఉదారతకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ పంచాయతీ కార్యదర్శి రజిత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ కుమార్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 74

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం
హైదరాబాద్ : బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *“ఇంటింటా ఇందిరమ్మ కుట్టు...
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో టి. ఆర్.పి పాదయాత్ర
బాలాపూర్ లో స్పీకర్ గడ్డ ప్రసాద్ కు ఘన స్వాగతం
ప్రధాని మోదీ పుట్టినరోజున ప్రతి ఇంట దీపం వెలిగించాలి
సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ.. 
సెప్టెంబర్‌ 17పై సమరశంఖం!
చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్