సాగులో చీడ పీడల"యాజమాన్య పద్ధతుల పై అవగాహన.
సాగులో చీడపీడల నివారణ పై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు.
ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైతు వేదిక లో మంగళవారం ఆత్మ ఆధ్వర్యంలో ఆర్ పి ఎల్ శిక్షణ లో భాగంగా సమీకృత వ్యవసాయం నూతన సాగు పద్ధతులు,వానకాలం పంటలపై వచ్చే చీడపీడల నివారణపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కునారం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను,ప్రస్తుతం ప్రధాన పంటలైన వరి,పత్తి,మొక్కజొన్న పంటలలో తీసుకోవాల్సిన ఎరువులు,కలుపు యాజమాన్యం చీడపీడల నివారణ పై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం కి విచ్చేసిన తెలంగాణ విజ్ఞాన కేంద్రం పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సంపత్ మాట్లాడుతూ మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఆరుతడి పంటల వల్ల కలిగే లాభాలు గురించి వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త లు మాట్లాడుతూ...ప్రస్తుతం వరి పంటలో మోగి పురుగు సమస్య కనబడుతుందని దీని నివారణకు కార్ టాప్ ఏడ్రోక్లోరైడ్ 400 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాంత్రి 600 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఐసోసైక్లోసిరం 128 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలన్నారు. అదేవిధంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఇమామెట్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనటోరం 0.5ml లీటర్ నీటికి లేదా క్లోరాంతర నీలిప్రోలు 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.పత్తిలో పచ్చ దోమ నివారణకు లోని కామెంట్ 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడా క్లోపరేట్ 0.25ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్,సర్పంచ్ అంబాలసారమ్మ,పిఎసిఎస్ చైర్మన్ సుమన్ రెడ్డి,ఏ ఈ ఓ లు మౌనిక,కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


